: ఏటీఎంలో మంటలు


నగదు తీసుకునేందుకు ఏటీఎంకెళ్ళిన వినియోగదారులు భీతావహులైన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీనివాసం వద్ద ఓ బ్యాంకుకు చెందిన ఏటీఏంలో మంటలు రావడంతో ఖాతాదారులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటీన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News