: చైనా ఆక్రమించిన ప్రాంతంలో దిగిన భారత విమానం


చైనా సరిహద్దుల్లోని దౌలత్ బేగ్ ఒల్డిలో భారత వాయు సేనకు చెందిన 'సూపర్ హెర్క్యులస్' రవాణా విమానం దిగింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఈ ఎయిర్ స్ట్రిప్ పై వాయుసేనకు చెందిన సి-130 విమానం ల్యాండయింది. కొన్ని నెలల క్రితం దౌలత్ బేగ్ ఒల్డిలో చైనా సైనికులు అక్రమంగా ప్రవేశించి శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. సుదీర్ఘచర్చల అనంతరం వారు వెనక్కు వెళ్లారు. దీంతో వ్యూహాత్మకంగా కీలక ప్రాంతమైన ఒల్డిలో పటిష్ఠ రక్షణ చర్యలకు భారత్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సి-130 విమానం సైనికులతో వెళ్లి ఆ ప్రదేశంలో దిగింది.

  • Loading...

More Telugu News