: బ్రిటన్ యువరాజు జార్జ్ ఫోటోలు విడుదల
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల తొలి సంతానం ప్రిన్స్ జార్జ్ ఫొటోలను అధికారికంగా మీడియాకు విడుదల చేశారు. జూలై 22 న ప్రిన్స్ జార్జ్ జన్మించిన విషయం తెలిసిందే. కెన్సింగ్టన్ రాజభవన వర్గాలు ఈ ఫొటోలను మీడియా ప్రతినిధులకు అందజేశారు. బ్రిటన్ యువరాజుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న విషయం విదితమే. ప్రిన్స్ జార్జ్ జననం సందర్భంగా వేల కోట్ల రూపాయలు పందేల రూపంలో చేతులు మారిన విషయం కూడా తెలిసిందే. దీంతో ప్రిన్స్ జార్జ్ ను తొలిసారిగా యువరాజు దంపతులు ప్రపంచానికి పరిచయం చేశారు.