: సాక్షులను భారత్ కు పంపేందుకు నిరాకరిస్తున్న ఇటలీ
కేరళ అరేబియా సముద్ర తీరంలో భారత మత్స్యకారులను ఇటలీ నావికులు కాల్చి చంపిన ఘటనలో నలుగురు ప్రత్యక్ష సాక్షులను భారత్ కు పంపేందుకు ఇటలీ నిరాకరించింది. భారత మత్స్యకారులను చంపిన ఘటనలో ఇద్దరు ఇటలీ నావికులు భారత్ లో విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గతంలో, ఇటలీ తమ నావికులు అమాయకులని, నిరపరాధులని వాదించింది.