: మీడియా ముందు శంకర్రావు ఆక్రోశం
మాజీ మంత్రి, కంటోన్మోంట్ ఎమ్మెల్యే శంకర్రావు ఆక్రోశిస్తున్నారు. తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయంటూ ఆవేదన వెలిబుచ్చారు. సీఎం కిరణ్, డీజీపీ దినేశ్ రెడ్డి తనపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నారని మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. తనపై చేస్తున్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న తన సోదరుడు దయానంద్ ను అరెస్టు చేయడం పట్ల నిరసనగా అసెంబ్లీ ముందు మౌనదీక్ష చేపట్టారు.