: మహారాష్ట్రలో ఘాతుకం


మహారాష్ట్రలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న సామాజిక కార్యకర్త నరేంద్ర ధబోల్కర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. గతకొంతకాలంగా ధబోల్కర్ మూఢనమ్మకాలు, క్షుద్రపూజలు వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు పటిష్ట చట్టం కావాలని పోరాడుతున్నారు. పుణేలో ఈ ఉదయం వాకింగ్ కు వెళ్ళి వస్తుండగా.. ఓంకారేశ్వర్ వంతెన వద్ద మోటార్ బైక్ పై వచ్చిన దుండగులు ఆయనపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు.

రెండు బుల్లెట్లు ఆయన తల వెనుక భాగంలో తాకడంతో అక్కడిక్కడే మరణించారు. దీంతో, ఆయన స్వస్థలం సతారా పట్టణంలో మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అన్ని రాజకీయపార్టీలు రేపు పుణేలో బంద్ కు పిలుపునిచ్చాయి. కాగా, ధబోల్కర్ హత్యకు సంబంధించి సమాచారం అందిస్తే రూ.10 లక్షలిస్తామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఈ ఘటన సర్కారుకు, పోలీస్ వ్యవస్థకు ఓ మాయని మచ్చలాంటిదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ సర్కార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News