: సీమాంధ్రకు న్యాయం జరిగే వరకు పోరాడతాం:టీడీపీ ఎంపీలు
సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగే వరకు పార్లమెంటులో ఆందోళన కొనసాగిస్తామని రాజ్యసభలో టీడీపీ ఎంపీలు అన్నారు. పార్లమెంటు సమావేశాలు వాయిదా పడడంతో వారు మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసమే పార్లమెంటులో తమతో పాటు కాంగ్రెస్ ఎంపీలు కలసి వచ్చారని, విజయమ్మదీక్ష చేస్తుంటే మేకపాటి పార్లమెంటులో నోరు మెదపడంలేదెందుకని ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రజల పక్షాన టీడీపీ మాత్రమే ఉందని, సీమాంధ్రకు న్యాయం జరిగేవరకు పార్లమెంటు లోపలా, బయటా కూడా పోరాడతామని టీడీపీ ఎంపీలు స్పష్టం చేశారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయంపై సీడీలను సోనియా అద్వానీలకు అందజేసినట్టు టీడీపీ ఎంపీలు తెలిపారు. సీమాంధ్రకు అన్యాయం జరిగితే సహించేది లేదని, రాష్ట్ర విభజన నిర్ణయం ఉపసంహరించుకోవాలని వారు సూచించారు.