: బొగ్గు స్కాం ఫైళ్లపై ప్రతిపక్షాల రగడతో 'ఆహార భద్రతా బిల్లు' వాయిదా
ఈరోజు లోక్ సభలో ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ వాయిదాపడింది. రాజీవ్ గాంధీ 69వ జయంతి సందర్భంగా నేడు బిల్లును సభలో పెట్టాలని కాంగ్రెస్ భావించింది. అయితే, బొగ్గుకు సంబంధించిన ఫైళ్ల గల్లంతుపై ప్రతిపక్షాలు రగడ చేయడంతో కాంగ్రెస్ ఆశలు ఆవిరయ్యాయి. దాంతో, సభ గురువారానికి వాయిదాపడటంతో ఆ రోజే బిల్లును ప్రవేశ పెట్టనున్నారు.