: భర్తపై కొనసాగుతున్న యుక్తాముఖి న్యాయపోరాటం
సెషన్స్ కోర్టు తన భర్త ప్రిన్స్ తులికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి యుక్తాముఖి బాంబే హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. భర్త ప్రిన్స్ తులి తనను శారీరకంగా, మానసికంగా వేధించడంతోపాటు అసహజ శృంగారం కోసం హింసిస్తున్నాడని యుక్తాముఖి గతనెలలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ముంబయి సెషన్స్ కోర్టు తులితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై యుక్తాముఖి బాంబే హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ ను నేడు విచారించిన న్యాయస్థానం తులికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.