: జడ్జిలు, న్యాయవాదులు ప్రజలకు జవాబుదారీ: భారత చీఫ్ జస్టిస్


ప్రజలు ఎన్నుకోకపోయినప్పటికీ జడ్జిలు, న్యాయవాదులు కూడా ప్రజలకు జవాబుదారీనే అని, ప్రజలకు జవాబు చెప్పాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం అన్నారు. చెన్నైలో వివాదాలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందించే కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా సదాశివం మాట్లాడారు. న్యాయవ్యవస్థపై ప్రజలకు ఎంతో నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. జడ్జిలు, న్యాయవాదుల ప్రవర్తన దీనికి తగినట్లుగా ఉండాలని సూచించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కూడా హాజరయ్యారు.

  • Loading...

More Telugu News