: కెప్టెన్ పాత్రలో కోహ్లీ కుదురుకుంటున్నాడు: ధోనీ
జట్టు నాయకత్వ బాధ్యతల్లో విరాట్ కోహ్లీ కుదురుకుంటున్నాడని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. గత ఏడాది కాలంలో కోహ్లీ ఎంతో మారాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కోహ్లీ చక్కగా భావ వ్యక్తీకరణ చేయగలడని, కెప్టెన్ కు అది తోడ్పడుతుందన్నాడు. ఆట పట్ల అతడి వైఖరి, మైదానంలో ఆడే తీరు మారిపోయిందని చెప్పాడు. కెప్టెన్ బాధ్యతలకు కావాల్సినవన్నీ ఇప్పుడు కోహ్లీలో ఉన్నాయని, జింబాబ్వే పర్యటనలో బాధ్యతలను బాగా నిర్వహించాడని ప్రశంసించాడు.