: జైలు నుంచి బయటకు వచ్చేందుకు సంజయ్ దత్ దరఖాస్తు
పుణెలోని యెరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న నటుడు సంజయ్ దత్ పెరోల్ సెలవు కోసం దరఖాస్తు చేసుకున్నారు. 20 రోజుల క్రితం దాఖలు చేసుకోగా అదిప్పుడు ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది. జైలు నిబంధనల ప్రకారం ఖైదీలు అత్యవసర పరిస్థితుల్లో 30 రోజుల పెరోల్ పొందే అవకాశం ఉంది. దీనిని 60 రోజులకు పెంచే అవకాశం కూడా ఉంది. ఖైదీ ప్రవర్తన ఆధారంగానే పెరోల్ సెలవును మంజూరు చేస్తారు. సంజయ్ పెరోల్ కు ఒక బాలీవుడ్ నటుడు పూచీకత్తు ఇచ్చినట్లు సమాచారం.