: కేసీఆర్ సవాల్ విసిరితే కిరణ్ పారిపోయారు: కేటీఆర్


సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ విసిరిన సవాల్ కు కిరణ్ వద్ద జవాబే లేకుండా పోయిందని, పత్తా లేకుండా పారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కిరణ్ ఓ దద్దమ్మ అని, ఆయనకు దమ్ము అనేదే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను వారి ఇంటి వ్యవహారంలా మార్చేసిందని మండిపడ్డారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబుపైనా నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజనపై బాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించారు. బాబు గనుక విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టయితే వెంటనే హరికృష్ణ, పయ్యావుల కేశవ్ లపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News