: రేపు చెన్నైలో రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న ముఖ్యమంత్రి
నెల్లూరు జిల్లా శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పీఎస్ఎల్ వీ సీ-20 రాకెట్ ప్రయోగాన్నివీక్షించేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం రాష్ట్రానికి రానున్నారు.
ఈ సందర్భంగా సోమవారం చెన్నై విమానాశ్రయానికి రానున్న రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అనంతరం చెన్నైనుంచి శ్రీహరికోటలో జరగనున్న రాకెట్ ప్రయోగానికి రాష్ట్రపతితో పాటు ముఖ్యమంత్రి కూడా హాజరు కానున్నారు.