: రాజ్యసభ వాయిదా.. అదే బాటలో లోక్ సభ
పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. బొగ్గుశాఖలో కీలక పత్రాలు గల్లంతు కావడంపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఉభయసభల్లోనూ తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. బొగ్గు స్కాం పత్రాలపై కేంద్ర ప్రభుత్వం అబద్దాలాడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. పత్రాలు మాయం కాలేదని, మాయం చేశారని రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ మండిపడ్డారు. దీంతో బొగ్గు శాఖ మంత్రి వివరణ ఇస్తారని చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు శాంతించలేదు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో, పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్ సభ మధ్యాహ్నం ఒంటిగంట వరకు వాయిదా పడగా, రాజ్యసభ తీవ్ర గందరగోళంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదాపడింది.