: అమెరికాపై సైబర్ దాడులతో మాకు సంబంధం లేదు: చైనా


అమెరికా వ్యవస్థలపై సైబర్ దాడులలో తమ పాత్ర లేదని చైనా స్పష్టం చేసింది. అసలు సైబర్ దాడులకు ఆసియాలో తమ దేశమే ప్రథమ బాధితురాలిగా ఉందని చైనా రక్షణ మంత్రి జనరల్ చాంగ్ వాంక్వాన్ వాషింగ్టన్లో అమెరికా రక్షణ మంత్రి చక్ హ్యాజెల్ తో భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో చెప్పారు. సైబర్ దాడులను ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేస్తున్నామని, ఏ రూపంలోనైనా సరే హ్యాకింగ్ కార్యకలాపాలను తాము ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. సైబర్ భద్రత ప్రపంచవ్యాప్త సమస్యగా చెప్పారు. సైబర్ ప్రపంచాన్ని శాంతి కోసమే వినియోగించాలన్నది చైనా అభిమతమని తెలిపారు. ఇటీవలి కాలంలో అమెరికా రక్షణ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ విభాగాల కంప్యూటర్లు, ప్రైవేటు కంపెనీల సర్వర్లపై హ్యాకింగ్ దాడులు జరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News