: బోల్ట్, నడాల్ లను వెనక్కినెట్టిన ధోనీ


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆట పరంగానే కాదు, ఆర్జన పరంగానూ దూసుకెళుతున్నాడండోయ్. ఫోర్బ్స్ పత్రిక తాజాగా వెల్లడించిన సంపన్న క్రీడాకారుల జాబితాలో ధోనీ 16వ స్థానానికి చేరుకున్నాడు. ధోనీ ఏకంగా 15 స్థానాలు ఎగబాకడం విశేషం. కాగా, క్రికెట్ మ్యాచ్ ఫీజులు, వాణిజ్య ప్రకటనలు, వివిధ వ్యాపారాల రూపేణా ఈ జార్ఖండ్ డైనమైట్ ఏటా రూ.180 కోట్ల ఆదాయం కళ్ళజూస్తున్నట్టు పత్రిక పేర్కొంది. కాగా, భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (రూ.125 కోట్లు) ఈ జాబితాలో 31వ స్థానంలో నిలిచాడు. ఇక విఖ్యాత గోల్ఫర్ టైగర్ వుడ్స్ ఏటా రూ.400 కోట్లు వెనకేసుకుంటూ ఆదాయం పరంగా నెంబర్ వన్ స్పోర్ట్స్ మన్ గా నిలిచాడు.

  • Loading...

More Telugu News