: నెలపాటు కనువిందు చేయనున్న తోకచుక్క
ఆకాశం ఎన్నో వింతలు, విశేషాలకు నెలవు. తోకచుక్కలు గురించి తరచుగా వింటూ ఉంటాం. కానీ, చూసేది అరుదు. అయితే తోకచుక్క చూడాలనుకునేవారికి ఓ చక్కటి అవకాశం వస్తోంది. ఐఎస్ఓఎన్ అనే తోకచుక్క ఓ నెలపాటు నింగిలో దర్శనమివ్వనుంది. ఇది గత నెలలోనే సౌర వ్యవస్థలోకి ప్రవేశించింది. ప్రస్తుతం టెలిస్కోప్ సాయంతో దీనిని సౌర కుటుంబంలో గుర్తించవచ్చు. కానీ, నవంబర్ 28 నుంచి డిసెంబర్ నెల చివరి వరకూ ఏ టెలిస్కోప్ అవసరం లేకుండానే ఈ తోకచుక్కను నేరుగా చూడవచ్చు. భూమికి అతి సమీపంగా 150 కిలోమీటర్ల దూరం వరకూ ఇది ఆ సమయంలో వస్తుంది. కనుక రాత్రి వేళ నేరుగా వీక్షించవచ్చని భారత్ జ్ఞాన విజ్ఞాన సమితికి చెందిన జయకుమార్ చెప్పారు. ఈ తోకచుక్క భూమికి సమీపంగా రానున్న విషయాన్ని ప్రచారం ద్వారా తెలియజేస్తామని అన్నారు.