: బీహార్ రైలు ప్రమాదం నష్టం 90 కోట్లు


బీహార్ లో పట్టాలపై నిలబడిన భక్తుల మీదినుంచి రైలు దూసుకెళ్లిన ఘటనలో 38 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో తీవ్ర ఆగ్రహోదగ్రులైన ప్రయాణీకులు, స్థానికులు కలిసి సహార్సా నుంచి పాట్నా వెళ్తున్న రాజ్యరాణి ఎక్స్ ప్రెస్(నెం12567) లోని ఇంజన్, ఒక ఏసీ బోగీ సహా మొత్తం 12 బోగీలకు నిప్పు పెట్టారు. అంతటితో ఆగకుండా సమస్తిపూర్ నుంచి సహార్సా వెళ్లే ప్యాసింజర్ రైలుకు చెందిన ఇంజన్ తో పాటు ఐదు బోగీలను తగులబెట్టేశారు. దీంతో రైల్వేశాఖకు మొత్తం 90 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.

ప్రజల కోపానికి కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని, పట్టాలు సహా అన్నీ పాడైపోయాయని, కనీసం ఆ ప్రాంతానికి వెళ్లి ఆస్తులు కాపాడుకోవడానికి కూడా సాధ్యంకాలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్వో అబిత్ బా ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రాంతానికి నేరుగా రోడ్డు మార్గం లేకపోవడంతో వైద్య సేవలు సకాలంలో అందించలేకపోయారు. రైల్వే రక్షక బృందాలు మధ్యాహ్నం మూడుగంట ప్రాంతంలో అక్కడికి చేరుకున్నాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

  • Loading...

More Telugu News