: పసిఫిక్ సముద్రంలోకి విషపు నీరు?
జపాన్ లోని ఫుకుషిమా అణు రియాక్టర్ లో నీరు రేడియోధార్మికత ప్రభావంతో విషతుల్యంగా మారిందని జపాన్ అటామిక్ రెగ్యులేటరీ కమిటీ ప్రకటించింది. ట్యాంకు నుంచి నీరు లీకవుతోందని తెలిపింది. 2011లో వచ్చిన భూకంపం, సునామీ దెబ్బకు ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రం దెబ్బతిన్న సంగతి తెలిసిందే. తాజాగా విషపు నీరు లీకవుతుండడంతో దానిని డ్రైనేజీ ద్వారా పసిఫిక్ మహాసముద్రంలోకి విడుదల చేయాలని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ భావిస్తోంది. ఇలా చేస్తే గనుక సముద్రంలో జలచరాలకు పెద్ద ముప్పు ఏర్పడినట్లే.