: క్షమించండి.. చెప్పినట్లు నడుచుకుంటా: పాక్ క్రికెటర్ ఆసిఫ్


స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడి ఏడేళ్ల నిషేధానికి గురైన పాక్ పేసర్ మహమ్మద్ ఆసిఫ్ బోర్డుకు క్షమాపణ చెప్పాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో అధికారుల విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ పాక్ క్రికెట్ బోర్డుకు తెలియజేశాడు. నిన్న లాహోర్ లో బోర్డు అధికారులను కలిసి లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాడు. ఈ విషయాన్ని బోర్డు అధికారి ఒకరు ధ్రువీకరించారు. క్రికెట్ బోర్డు, ఐసీసీ ఆదేశాల మేరకు అన్ని రకాల శిక్షణ, పునరావాస కార్యక్రమాలకు హాజరవుతానని ఆసిఫ్ తెలిపినట్లుగా ఆ అధికారి వెల్లడించారు. 2010లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో స్పాట్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు ఆసిఫ్ గతవారం అంగీకరించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News