: డాలర్ తో రూపాయి@ 64.10


డాలర్ తో రూపాయి మారకం విలువ ఫారెక్స్ మార్కెట్లో ఈ రోజు మరో కనిష్ఠ స్థాయిని నమోదు చేసుకుంది. బ్యాంకులు, దిగుమతి దారుల నుంచి డాలర్లకు డిమాండ్ ఎప్పటిలానే కొనసాగడంతో డాలర్ తో రూపాయి మారకం విలువ నిన్న ముగింపుతో పోలిస్తే 97 పైసలు నష్టపోయి 64.10కు దిగజారింది. నిన్న రూపాయి 1.43 నష్టపోయి 63.13 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. రూపాయి విలువ పతనానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఇటీవలి కాలంలో తీసుకున్న చర్యలు ఫలితం లేకుండా పోయాయని ఫారెక్స్ డీలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ఉద్దీపనల ఉపసంహరణ ప్రకటన తర్వాత డాలర్ బలపడడమే రూపాయి విలువ జారడానికి కారణమంటున్నారు.

  • Loading...

More Telugu News