: బరువు తగ్గడం వల్ల రోగాలు దూరం
అధిక బరువున్నవారు మీ బరువును తగ్గించుకోవడం వల్ల పలు ప్రధానమైన వ్యాధులను దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు కారణంగా వచ్చే మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, బ్లడ్ ప్లెషర్, ఆర్థ్రరైటిస్ వంటి పలురకాలైన వ్యాధులను దూరంగా ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహం అనేది సర్వసాధారణంగా కనిపించే వ్యాధి. రెండు రకాలుగా కనిపించే ఈ వ్యాధి మనం ఆచరించే ఆహారపు అలవాట్ల కారణంగా వస్తుంది. మన ఆహారపు అలవాట్ల కారణంగానే మధుమేహం, ఎముకల బలహీనత, ఇంకా స్థూల కాయం వంటి వ్యాధులు మనకు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అధిక బరువును తగ్గించుకుంటే ఇలాంటి వ్యాధుల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బరువు పెరగడానికి కారణం మన ఆహారపు అలవాట్లతోబాటు వంశపారంపర్యంగా సంభవించే స్థూలకాయం, ఇంకా పరిసరాలు, హార్మోన్ల అసమతౌల్యం, మన నిద్రకు సంబంధించిన అలవాట్లు ఇవన్నీ కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అధిక బరువు కారణంగానే మనకు పలురకాలైన వ్యాధులు వచ్చే ప్రమాదముందని, కాబట్టి బరువు తగ్గించుకోవాల్సిందిగా నిపుణులు హెచ్చరిస్తున్నారు.