: జుట్టు రాలిపోతోందా...


మీ జుట్టు రాలిపోతోందని బాధగా ఉందా... అయితే దీనికి రక్తహీనత కారణం కావచ్చు. ఎందుకంటే రక్తహీనత వల్ల జుట్టు రాలిపోవడం, జుట్టు చివర్లు చిట్లిపోవడం వంటివి జరుతుంటాయి. మహిళల్లో ఎక్కువగా కనిపించేవ్యాధి రక్తహీనత. ఇది ఇప్పటి వరకూ గ్రామీణ మహిళల్లోనే ఎక్కువగా ఉంటుందని భావించేవారు. అయితే దీనికి పట్టణాల్లో నివసించే మహిళలేమీ మినహాయింపు కాదంటున్నారు నిపుణులు. పట్టణాల్లో నివసించే మహిళల్లో కూడా రక్తహీనత ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

పట్టణాల్లో మహిళలు సన్నగా, నాజూగ్గా కనబడాలని తక్కువ ఆహారం తీసుకుంటుంటారు. దీంతో శరీరానికి అవసరమైన పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోరు. ఫలితంగా రక్తహీనత బారినపడుతున్నారట. మన రక్తంలోని ఎర్ర రక్తకణాలు ఆక్సిజన్‌ను మోసుకెళ్లి అన్ని భాగాలకు చేరవేస్తాయి. దీనికి హిమోగ్లోబిన్‌ తోడ్పడుతుంది. అయితే ఈ హిమోగ్లోబిన్‌ తయారుకావడానికి తగినంత ఇనుము అవసరం. ఇనుము లోపిస్తే హిమోగ్లోబిన్‌ ఏర్పడదు. ఫలితంగా రక్తహీనతకు దారితీస్తుంది. ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గిపోయి రక్తహీనత వస్తుంది. ఫలితంగా ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం, అరికాళ్లు, అరిచేతులు చల్లగా ఉండడం, వెంట్రుకలు చిట్లిపోవడం, ఊడిపోవడం, తలనొప్పి, తల తేలిపోతున్నట్టు అనిపించడం ఇవన్నీ కూడా రక్తహీనత లక్షణాలే. పట్టణాల్లో ఉండే మహిళలకు రక్తహీనతను నివారించేందుకు తగినంత సమాచారం తెలిసినా ఉద్యోగాలు చేయడం, ఇంట్లో వండుకుని తినే సమయం దొరకకపోవడంతో బయట ఏదో ఒకటి తినేయడం వంటి కారణాలవల్ల పట్టణాల్లో ఉండే మహిళలు కూడా రక్తహీనత బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకునే మహిళలు ఇనుము బాగా ఎక్కువగా ఉండే ఆకుకూరలను తీసుకొంటూ రక్తహీనతను దూరం చేసుకోవచ్చని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News