: రూపాయికి దుస్థితి... ఒక్క రోజులోనే 148 పైసల భారీ పతనం
రూపాయి మారకం విలువ ఈరోజు భారీగా పతనమైంది. ఒకే రోజులో 148 పైసలు పతనమై రికార్డు సృష్టించింది. ఈ భారీ పతనం వల్ల డాలర్ తో రూపాయి మారకం విలువ 63.13 గా ఉంది. డాలర్లపై మదుపరులు విశేషమైన ఆసక్తి ప్రదర్శించడం వల్లే రూపాయికి ఈ దుస్థితి పట్టిందని నిపుణులు చెబుతున్నా.. ఆర్ధిక రంగంలో ఒకరకమైన భయాందోళనలు నెలకొన్నాయి. గత మూడు నెలల్లో రూపాయి దారుణంగా పతనమవుతూ వస్తోంది. సరాసరి ఆర్బీఐ, ఆర్ధిక మత్రిత్వ శాఖ రంగలోకి దిగినా రూపాయి పతనం ఆగడంలేదు. ఈ పతనం ఎక్కడికి దారితీస్తుందో అనే భయం అందర్లోనూ నెలకొంది.