: 'ఇటాలియన్ గాంధీ నుంచి తెలుగువారిని రక్షించు బాపూ'


రాజమండ్రిలో సమైక్యాంధ్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 'ఇటాలియన్ గాంధీ నుంచి తెలుగువారిని, సమైక్యాంధ్రను రక్షించు బాపూ' అనే ప్లకార్డు చేబూని గాంధీ విగ్రహం చుట్టూ సత్తిబాబు అనే ఉద్యమకారుడు ప్రదక్షిణలు చేశాడు. ఇక, ఆర్టీసీకి చెందిన అద్దెబస్సులతో సమైక్యవాదులు భారీ ర్యాలీ నిర్వహించారు. గోకవరం బస్టాండులో అంగన్ వాడీ కార్యకర్తలు నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. విభజన దేశానికే ముప్పని, తెలుగు జాతిని నాశనం చేస్తుందని సమైక్యవాదులు మండిపడ్డారు.

  • Loading...

More Telugu News