: వాద్రా భూ వ్యవహారంలో వ్యాజ్యాన్ని తిరస్కరించిన అలహాబాద్ కోర్టు
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా-డీఎల్ఎఫ్ కంపెనీ మధ్య క్విడ్ ప్రోకో జరిగిందంటూ అరవింద్ కేజ్రివాల్, ప్రశాంత్ భూషణ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన వ్యాజ్యాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. దీనిలో విచారించటానికి తామెలాంటి ఆధారాలను కనుగొనలేదని కోర్టు పిటిషన్ ను తోసిపుచ్చింది. వాద్రా భూ వ్యవహారంలో దర్యాప్తు చేయించాలని ఆదేశించాలంటూ లక్నోకు చెందిన నూతన్ కుమార్ అనే స్థానిక కార్యకర్త పిటిషన్ ను దాఖలుచేశాడు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వాద్రాకు క్విడ్ ప్రోకో తరహాలో సహకరించాయంటూ వాద్రాపై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.