: 'జీఎస్ఎల్వీ డీ-5' ప్రయోగం వాయిదా
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఈ సాయంత్రం 4.50 గంటలకు ప్రయోగించాల్సిన 'జీఎస్ఎల్వీ డి-5' ప్రయోగం వాయిదాపడింది. క్రయోజనిక్ ఇంజిన్లో ద్రవరూప ఆక్సిజన్ ఇంధనం నింపుతుండగా లీకేజీని గుర్తించారు. డి-5లోని ఎస్2 విభాగంలో సాంకేతిక సమస్య తలెత్తడంవల్ల ప్రయోగం వాయిదా వేస్తున్నట్టు షార్ అధికారులు ప్రకటించారు. దాంతో, గంట 14 నిముషాల ముందు ప్రయోగాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఇస్రో తెలిపింది.