: నిజాంపేటలో కర్రీ పాయింట్ వద్ద కాల్పులు
హైదరాబాద్ లో గన్ కల్చర్ క్రమంగా వేళ్ళూనుకుంటోంది. తాజాగా, కూకట్ పల్లి నిజాంపేటలో ఓ కర్రీ పాయింట్ వద్ద కాల్పుల కలకలం రేగింది. గతరాత్రి ఓ దొంగ శ్రీలక్ష్మి కర్రీపాయింట్ యజమాని చందు నుంచి రూ.45 వేలు లాక్కునేందుకు యత్నించాడు. అయితే, చందు ప్రతిఘటించడంతో దొంగ తనవద్దనున్న తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో, చందు చేతికి గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కాల్పులతో స్థానికులు భయబ్రాంతులకు గురికాగా, సమాచారం అందుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు చేపట్టారు.