: ఎడారిలా మారిన డార్జిలింగ్


క్వీన్ ఆఫ్ ద హిల్స్ గా పేరొందిన ప్రముఖ పర్యాటక ప్రాంతం డార్జిలింగ్ ఎడారిలా నిర్మానుష్యంగా మారింది. గూర్ఖాల్యాండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో గూర్ఖాలాండ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఈరోజు ఇళ్లలోనే ఉండి నిరసన తెలియచేస్తున్నారు. దీంతో మనుషులు, వాహనాలు లేక రహదారులన్నీ బోసిపోయాయి. కేవలం సీఆర్పీఎఫ్ జవాన్లు, ఆర్పీఎఫ్ జవాన్లు మాత్రమే రోడ్లమీద, రైల్వేస్టేషన్లోనూ గస్తీ తిరుగుతున్నారు. కాగా, ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 500 మంది జీజేఎం మద్దతుదారులు అరెస్టయ్యారు.

  • Loading...

More Telugu News