: ఉద్యమం మరింత ఉద్ధృతం: అశోక్ బాబు


సెప్టెంబర్ 1 నుంచి సమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లో బహిరంగ సభ జరిపితీరుతామని, హైదరాబాద్ ఎవరి సొంతమూ కాదని అన్నారు. ఎస్మాకు భయపడబోమని, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని అశోక్ బాబు తెలిపారు. సీమాంధ్రులను రెచ్చగొట్టేలా తెలంగాణ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని, దాడులు జరగకపోయినా జరిగాయంటున్నారని ఆరోపించారు. వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అయన అన్నారు. రాజకీయ గిమ్మిక్కులకు తెలంగాణ నేతలు తెరదీస్తున్నారని వారి నైతికత ఎంతో అందరికీ తెలిసిందేనని విమర్శించారు.

  • Loading...

More Telugu News