: గుంటూరులో టీడీపీ నేతల దీక్ష ప్రారంభం
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీరుకు నిరసనగా గుంటూరు జిల్లాలో టీడీపీ నేతలు దీక్షలు ప్రారంభించారు. దీక్షలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రి శనక్కాయల అరుణ పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ నేతలు చేపట్టిన దీక్షపై సమైక్యవాదులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ తీరులో స్పష్టత లేదని, విభజన తీరుపై నిరసన ఏంటని ద్వజమెత్తుతున్నారు. సీమాంధ్రులంతా సమైక్యమే తమ నినాదమంటూ నిరసనలతో హోరెత్తిస్తుంటే విభజన తీరుపై దీక్ష ఎందుకంటూ మండిపడుతున్నారు. రాజకీయ పార్టీలు ఏవైనా సరే సమైక్యమే తమ నినాదంగా ప్రజలతో మమేకం కావాలని విద్యార్ధి జేఏసీ స్పష్టం చేసింది.