: 35కు పెరిగిన రైలు ప్రమాద మృతులు


డ్రైవరు నిర్లక్ష్యంతో 35 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బీహార్లో ఈ ఉదయం దమారా రైల్వే స్టేషన్లో ప్రయాణికుల పైనుంచి రైలు దూసుకెళ్లిన ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 35కు చేరుకుంది. 40 మందికి పైగా గాయపడగా వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సహర్షా సమీపంలోని దమారా ఘాట్ స్టేషన్లో ఈ ఘోర ప్రమాదం జరిగింది.

దమారా రైల్వే స్టేషన్లో మొత్తం మూడు ట్రాక్ లు ఉన్నాయి. రెండు ట్రాకుల్లో రెండు రైళ్లు ఆగాయి. వాటి నుంచి దిగిన ప్రయాణికులు మూడో ట్రాక్ పై వచ్చి ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది సమీపంలోని శివాలయానికి వెళ్లేందుకు వచ్చిన వారే. ఇంతలోనే రాజ్యరాణి ఎక్స్ ప్రెస్ మధ్యలో ఉన్న మూడో ట్రాక్ పైకి వచ్చింది. ఈ ఎక్స్ ప్రెస్ కు ఈ స్టేషన్లో హాల్ట్ లేదు. సూపర్ ఫాస్ట్ రైలు అయినప్పటికీ.. స్టేషన్లో రైలు వేగాన్ని తగ్గించాలి. కానీ, డ్రైవరు నిర్లక్ష్యంతో వేగంగా రైలును అదే మార్గంలో స్టేషన్ దాటించాడు. దీంతో పట్టాలపై ఉన్న వారిని తొక్కుకుంటూ రైలు ముందుకెళ్లిపోయి స్టేషన్ బయట ఆగిపోయింది.

అందుకే మృతుల సంఖ్య భారీగా ఉంది. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ దారుణంతో స్టేషన్లోని ఇతర ప్రయాణికులు, స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. రైలుపై రాళ్లు రువ్వడంతోపాటు డ్రైవర్ ను పట్టుకుని చితక్కొట్టారు. దీంతో అతడి పరిస్థితి విషమంగా ఉంది. ఆ తర్వాత రైలు బోగీకి నిప్పంటించారు. ప్రమాద స్థలి భయం గొలిపేలా ఉంది.

  • Loading...

More Telugu News