: ఒడిశాలో పట్టుబడ్డ తాబేళ్ల స్మగ్లింగ్ రాకెట్
తాబేళ్లను స్మగ్లింగ్ చేసే ముఠాను ఒడిశాలోని మదన్ పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్రపర జిల్లాలో బిత్రకనిక నేషనల్ పార్కు సమీపంలో నిన్న శేఖర్ జెనా అనే వ్యక్తిని అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని అతడి వద్ద నుంచి 14 తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ మరికొందరు కలిసి తాబేళ్లను సమీపంలోని నీటి ప్రవాహాల నుంచి పట్టుకుని కోల్ కతా తదితర నగరాలకు స్మగ్లింగ్ చేస్తున్న వైనం వెలుగు చూసింది.