: తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి: కోదండరాం
తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద సద్భావన దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్షలో పాల్గొన్న జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజలు సంయమనంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇక, 10 జిల్లాలతో కూడిన తెలంగాణకే తాము ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు. ఆ తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా ఉండాలని నొక్కిచెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.