: దక్షిణ భారతం నుంచి గల్ఫ్ దేశాలకు తగ్గుతున్న వలసలు


ఒకప్పుడు పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు రాష్ట్రంతో పాటు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంతోమంది కార్మికులు ప్రయాణమయ్యేవారు. నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి గల్ఫ్ దేశాలు అనువుగా, ఆకర్షణీయంగా కనిపించేవి. కానీ, ప్రస్తుతం నాటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉపాధి అవకాశాలు, ఆదాయ మార్గాలు పెరగడంతో వలసలు తగ్గుమఖం పట్టాయని ప్రవాస వ్యవహారాల శాఖ వెల్లడించింది.

2008లో పదో తరగతి విద్యార్హత లోపు వారు 88,389 మంది గల్ఫ్ దేశాలకు వెళితే అది 2012 నాటికి 21,129 మందికి తగ్గింది. 2009లో 43,174, 2010లో 15,571 మంది, 2011లో 24,585 మంది కార్మికులు గల్ఫ్ దేశాలకు వెళ్లారని తెలిపింది. వాస్తవానికి ఇటీవలి కాలంలో గల్ఫ్ దేశాలలో విదేశీ కార్మికుల పట్ల ఆంక్షలు పెరిగిపోతున్నాయి. ఇది కూడా ఒక కారణంగా భావించవచ్చు.

  • Loading...

More Telugu News