: 13 ఏళ్లకే ఐఐటీలో సీటు సొంతం చేసుకున్నాడు
అతి చిన్న వయసులో ఐఐటీలో సీటు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించాడు బీహార్ బాలుడు సత్యం. తన తండ్రి రైతు అయినా, గ్రామంలో అంతగా ప్రమాణాలు లేని పాఠశాలలో చదువుకున్నా, ఆర్థిక స్థోమత లేకున్నా పట్టుదలతో ఐఐటీలో సీటు తెచ్చుకున్నాడు. ఐఐటీ జేఈఈ పరీక్షలో దేశవ్యాప్తంగా 1,50,000 మంది పరీక్ష రాస్తే సత్యం 679 ర్యాంకు తెచ్చుకున్నాడు. 12 ఏళ్లకే ఐఐటీ పరీక్షలో అర్హత సాధించినా, వచ్చిన ర్యాంకుతో సంతృప్తి చెందక సత్యం రెండోసారి ప్రయత్నించి మంచి ర్యాంకు తెచ్చుకున్నాడు. ఐఐటీలో బీటెక్ పూర్తి చేసేసరికి 17 ఏళ్లు వస్తాయి. అప్పటి నుంచి ఐఏఎస్ కోసం శిక్షణ తీసుకుని 21 ఏళ్లు రాగానే యూపీఎస్సీ పరీక్ష రాయడం.. ఐఏఎస్ అధికారి అయిపోవడం సత్యం తదుపరి లక్ష్యాలు. సోషల్ మీడియా వెబ్ సైట్ ను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. ఈ బుడతడు నిజంగా అసాధ్యుడే!