: మనదేశంలో మహిళలకు రక్షణ చాలా తక్కువేనట!


ప్రపంచంలోని 20 ప్రధాన దేశాలతో పోల్చుకుంటే మనదేశంలో మహిళలకు రక్షణ చాలా తక్కువేనని తాజా అధ్యయనంలో తేలింది. మనదేశంలో ఆడపిల్లలు గర్భస్థ దశనుండే అవరోధాలను ఎదుర్కొంటూ వస్తున్నారు. పెరిగేకొద్దీ స్త్రీ జాతికి ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. మహిళలు ఉండేందుకు అనువైన దేశాల జాబితాలో మనదేశం అట్టడుగు స్థానంలో ఉందని తాజా అధ్యయనంలో తేలింది.

జీ-20 దేశాల్లో మహిళలు ఎక్కడ సంతోషంగా, భద్రంగా ఉండగలరు? అనే విషయంపై ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో మహిళలకు ఎక్కువ భద్రత ఉండే దేశాల్లో కెనడా మొదటి స్థానంలో నిలిచింది. మనదేశం మాత్రం ఆఖరి స్థానంలో నిలిచింది. సౌదీ అరేబియా దేశం కూడా మనకంటే ఒకమెట్టు పైనే ఉందట. చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసేయడం, గర్భంలో ఉన్నది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్లు చేయడం, అమ్మాయిలను చదువు మధ్యలోనే ఆపేయడం, సమాజంలో లైంగిక వేధింపులు... ఇలా అన్ని విషయాలను ఈ అధ్యయనంలో పరిగణలోకి తీసుకుని మనదేశానికి ఆఖరు స్థానం కేటాయించారు. అనాదినుండి మనదేశంలో మహిళలకు సమాజంలో తగు గౌరవం ఇస్తూ వచ్చారు. అయితే ఈ గౌరవం కాలం గడిచేకొద్దీ తరిగిపోతూ వచ్చి చివరికి మహిళలకు సమాజంలో గౌరవం అనేది కనుమరుగైపోతోంది. ఈ నేపధ్యంలో తాజాగా నిర్వహించిన అద్యయనంలో మనదేశంలో మహిళలకు భద్రత తక్కువని తేలింది.

  • Loading...

More Telugu News