: ఇలా మన కాలేయాన్ని కాపాడుకుందాం


మన కాలేయాన్ని చక్కగా కాపాడుకోవాలంటే రోజుకు ఎంచక్కా నాలుగు కప్పుల కాఫీ లేదా తేనీరు సేవించడం మంచిదంటున్నారు శాస్త్రవేత్తలు. రోజుకు ఇలా నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగడం వల్ల కాలేయానికి సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కాఫీ సేవనం ఆరోగ్యానికి హానికరం అంటూ కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నా, రోజుకు నాలుగు కప్పులకు మించి తాగితేనే హాని అని కూడా తెలియజేశారు. అంటే నాలుగు కప్పులైతే ఫరవాలేదు. అందుకే నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామంటున్నారు శాస్త్రవేత్తలు.

సింగపూర్‌లోని డ్యూక్‌ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో రోజుకు నాలుగు కప్పుల కాఫీ లేదా టీ తాగడం వల్ల మన కాలేయం చాలా చక్కగా రక్షించబడుతుందని తేలింది. శరీరంలోని కెఫైన్‌ స్థాయిని పెంచడం ద్వారా కాలేయంలో కొవ్వుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించొచ్చని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త సభ్యుడుగా ఉన్న ఈ అంతర్జాతీయ బృందం తెలిపింది. మద్యపానం ద్వారా కాకుండా వేరే కారణంగా వచ్చే కాలేయ వ్యాధి (ఎన్‌ఏఎఫ్‌ఎల్‌డీ)పై కాఫీ, టీలు చక్కటి ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెఫైన్‌ ప్రభావంపై జరిగిన తొలి పూర్తిస్థాయి అధ్యయనం ఇదేనని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన పౌల్‌ యెన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News