: ఎటిఎం కార్డు లేకుండానే బ్యాంకు లావాదేవీలు
బయోక్రిప్టాలజీ..పేరు విచిత్రంగా ఉంది కదూ.. కానీ చేసే పని మాత్రం నిఖార్సయినది. అది ఎలాగంటే.. ఇప్పటి వరకు బ్యాంకు లావాదేవీల్లో క్రెడిట్/డెబిట్ కార్డులు వచ్చాక ఆర్థిక మోసాలు కూడా పెరిగాయి.
వీటిని నియంత్రించేందుకు చేతి వేలిముద్రలను ఆ వ్యక్తి శరీరంలోని రక్త ప్రసరణతో సహ లెక్క గట్టి.. అతని వ్యక్తిగత సమాచారం రెండూ సరిపోలితేనే ఖాతా తెరవబడుతుంది. ప్రస్తుతం నెక్సస్ యూఎస్ ఏ అనే కంపెనీ ఈ తాజా పరిజ్ఞానంపై పేటెంట్ హక్కులు సొంతం చేసుకుంది.
అమెరికా సౌత్ డకోటా ప్రాంతలోని స్కూల్ ఆఫ్ మైన్స్ అండ్ టెక్నాలజీ క్యాంపస్ లో ఈ పద్ధతిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ పద్ధతిలో ఆర్థిక నేరాలకు చెక్ పెట్టవచ్చని అంటున్నారు ఈ సరికొత్త టెక్నాలజీ సృష్టికర్తలు. త్వరలోనే ఈ టెక్నాలజీని అమెరికా అంతటా విస్తృత పరిచే ఆలోచనలో నెక్సస్ యూఎస్ ఏ కంపెనీ ఉంది.