: వేడెక్కనున్న విశాఖ పోర్టు
విశాఖ పోర్టు కార్యకలాపాలకు సమైక్య సెగ తగిలింది. సమైక్యాంధ్రకు మద్దతుగా పోర్టు యూజర్స్ తమ కార్యకలాపాలను రేపు ఉదయం ఆరు గంటల నుంచి నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఉద్యమంలో తామూ పాల్గొంటున్నట్టు ఈమేరకు స్టీవ్ డోర్స్, ట్రాలర్స్, బీవోటీ ఆపరేటర్స్, స్టీమర్ ఏజెంట్స్ అన్ని వ్యవస్థలూ ఈ ఉద్యమంలో భాగస్వాములవుతాయని విశాఖపట్నం పోర్టు యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.