: ముస్లింలు మా వైపే: మోడీ ధీమా
గుజరాత్ లో ముస్లింలు అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీకే పట్టం కట్టారని ఆ రాష్ట్ర సీఎం, బీజేపీ ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్ర మోడీ చెప్పారు. ఇదే ఒరవడి కొనసాగించగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ముస్లింలు తమ పక్షానే నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో నేడు జరిగిన ఎన్నికల ప్రచార కమిటీ తొలి భేటీలో నేతలనుద్ధేశించి మోడీ మాట్లాడారు. నేతలు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు యత్నించాలన్నారు. ఇక యువతతో పాటు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారిని చైతన్యవంతుల్ని చేయాలని వారికి సూచించారు.