: అనంతపురంలో ఉద్రిక్తత
అనంతపురంలో సమైక్యాంధ్ర ఉద్యమ ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ఈ మధ్యాహ్నం పట్టణంలో అదనపు పోలీసు బలగాలు కవాతు నిర్వహించాయి. తమను అడ్డుకునేందుకే పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారని సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. బలగాలను అడ్డుకున్నారు. దీంతో, పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. మరోవైపు, సోమవారం నిర్వహించబోయే ర్యాలీలకు తాము అనుమతించడంలేదని అనంతపురం పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు చట్టం-30 అమల్లో ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ర్యాలీలు నిర్వహిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.