: 272 స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉంది: బీజేపీ
సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సన్నాహకాలు ముమ్మరమయ్యాయి. ఈమేరకు బీజేపీ ప్రచార కమిటీ తొలి సమావేశం నేడు ఢిల్లీలో జరిగింది. భేటీ అనంతరం ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల్లో 272 స్థానాలు గెలుస్తామన్న నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈమేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఆకాంక్షను తాము నెరవేర్చగలమనే భావిస్తున్నామని పేర్కొన్నారు. ఇక ఎన్నికల పోరు సన్నద్ధతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ భేటీలో అధ్యక్షుడు రాజ్ నాథ్, సీనియర్ నేత అద్వానీ, ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి అగ్రనేతలందరూ పాల్గొన్నారు.