: లడఖ్ వద్ద యూఎఫ్ఓలను చూశామంటున్న సైన్యం


గ్రహాంతరవాసులున్నారా..? ఉంటే, వారెలా ఉంటారన్న ప్రశ్నలు ఎప్పటి నుంచి మానవాళికి చర్చనీయాంశాలుగానే మిగిలిపోయాయి. కొందరు, గ్రహాంతరజీవులను చూశామని, వారు ప్రయాణించే యూఎఫ్ఓ (అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్) లను చూశామని చెబుతుండడం తెలిసిందే. తాజాగా, భారత సైన్యం కూడా తాము యూఎఫ్ఓలను చూశామని చెబుతోంది. లఢఖ్ వద్ద వాస్తవాధీన రేఖ వద్ద ఆకాశంలో కొన్ని యూఎఫ్ఓలు కనపించాయని సైనికులు తెలిపారు. ఈమేరకు సైన్యం పై అధికారులకు ఓ నివేదిక కూడా పంపడం గమనార్హం. ఇంతక్రితం కొన్ని వందలసార్లు ఇవి దర్శనమిచ్చాయని, సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఇప్పుడు కనిపించాయని సైనిక వర్గాలు వెల్లడించాయి.

కాగా, ఈ విషయమై పార్లమెంటులో రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ వివరణ ఇస్తూ, అవి యూఎఫ్ఓలే అనడానికి కచ్చితమైన ఆధారాల్లేవని సైన్యం వాదనను తోసిపుచ్చారు. ఇక ఈ విషయమై శాస్త్రవేత్తలు స్పందిస్తూ.. అవి గురు, శుక్ర గ్రహ శకలాలు అయివుండొచ్చని, ముఖ్యంగా లడఖ్ వంటి ఎత్తయిన ప్రదేశాల్లో ఇవి ఎక్కువగా దర్శనమిస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News