: వీహెచ్ పై తిరుమలలో కేసు నమోదు
తిరుమల వెంకన్న దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ, విభజన అనంతరం సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలంటూ వ్యాఖ్యానించిన రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై కేసు నమోదైంది. వీహెచ్ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఈ ఉదయం తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో, వీహెచ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఉన్న వీహెచ్ వ్యాఖ్యలు టీటీడీ నిబంధనలకు విరుద్ధమని చెవిరెడ్డి పేర్కొన్నారు.