: 21 నుంచి టీచర్ల మెరుపు సమ్మె.. ఉద్యమం తీవ్రరూపు


సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపు దాల్చింది. నేటి వరకు ఉద్యమానికి దూరంగానే ఉన్న ఉపాధ్యాయులు ఇకనుంచి ప్రత్యక్ష కార్యాచరణతో రంగంలోకి దిగేందుకు సమాయత్తమయ్యారు. ఈ నెల 21 అర్ధరాత్రి నుంచి మెరుపు సమ్మెకు దిగనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఇవ్వనున్నట్టు తెలిపారు. విజయవాడలో ఈ మధ్యాహ్నం జరిగిన సమైక్యాంధ్ర ఉపాధ్యాయ పోరాట సమితి సమావేశంలో ఈ తీర్మానం చేశారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలు ఈ భేటీలో పాల్గొన్నాయి.

ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు ఉండాలంటూ ఉపాధ్యాయ నేతలు అభిప్రాయపడ్డారు. సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న నేతలపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విభజన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు సమ్మె షురూ అవుతుందని వారు స్పష్టం చేశారు. రేపు జరగబోయే ఎంసెట్ కౌన్సెలింగ్ ను నిలిపివేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాము సాగించే ఉద్యమంలో హింసకు తావుండదని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News