: మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఉన్మాదం
పీకలదాకా మద్యం పట్టించిన ఓ లారీ డ్రైవర్ ఆరుగురి మృతికి కారణమయ్యాడు. నేడు ప్రకాశం జిల్లాలో జరిగిందీ సంఘటన. ఒంగోలు-చీరాల రహదారిపై ఈ లారీ డ్రైవర్ ఇష్టం వచ్చినట్టుగా వాహనాన్ని నడిపి రెండు చోట్ల యాక్సిడెంట్లకు పాల్పడ్డాడు. తొలుత నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద ఓ బైక్ ను ఢీకొని ఇద్దరిని పొట్టనబెట్టుకున్న ఆ డ్రైవర్, మద్దిరాలపాడు వద్ద రెండు ఆటోలను ఢీకొని నలుగురిని బలిగొన్నాడు.