: రాజీనామా లేఖ పర్సులోనే పెట్టుకుని తిరుగుతున్న మంత్రిణి
ఆంటోనీ కమిటీ ముందు సమైక్యాంధ్ర వాదనను బలంగా వినిపిస్తామని కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి అంటున్నారు. తాను సమైక్యాంధ్ర కోసం రాజీనామాకు సిద్ధమేనని, రాజీనామా లేఖను పర్సులోనే పెట్టుకున్నానని ఆమె మీడియాతో వెల్లడించారు. సీమాంధ్ర మంత్రులు అందరూ ఒకేతాటిపై నిలుచున్నారని ఆమె స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో జరిగిన సమైక్యాంధ్ర సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సభకు హాజరైన రాష్ట్ర మంత్రి కొండ్రు మురళి మాట్లాడుతూ, రెండో ఎస్సార్సీ వేస్తే అధిష్ఠానాన్ని నిలదీస్తామని హెచ్చరించారు.