: వీహెచ్ వ్యాఖ్యలకు రాయపాటి ఖండన
తిరుపతిలో వీహెచ్ చేసిన వ్యాఖ్యలను గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఖండించారు. ఆయన అలా మాట్లాడడం వల్లే దాడి జరిగి ఉండొచ్చని రాయపాటి అన్నారు. గుంటూరులో సమైక్యాంధ్ర ర్యాలీలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రాంతంలో నిరసన తెలపాలని తామెవరకీ చెప్పలేదన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా చేస్తున్న ఉద్యమం ఇదని, దీని వెనుక నేతలెవరూ లేరని స్పష్టం చేశారు.